Sewing a bookmark is easy and fun

www.ushasew.com ఏర్పాటు చేయబడింది మరియు కుట్టుపనిలో అన్ని దశలను మీకు వివరించే ఒక సమగ్రమైన ప్రోగ్రామ్ ను కలిగి ఉంది. ఈ వీడియోలను అనుసరించడం సులభం, వివరమైన సూచనలను కలిగి ఉండండి మరియు 9 భారతీయ భాషలలో లభిస్తుంది. ఈ పాఠాలు ప్రారంభంలో మీకు మంచి ఆరంభం ఇచ్చింది మరియు ఒకసారికి ఒకదశ ముందుకు వెళ్లవచ్చు. అన్ని పాఠాలు ముగిసిన తరువాత మరియు మీ అభ్యాసంత మీరు కుట్టగలరు మరియు అద్భుతమైనవాటిని తయారు చేయడానికి మీ సృజనాత్మకతను ఉపయోగించగలరు.

కానీ ఎప్పుడూ పని ఉండి, ఆట లేకుంటే అది జాక్, జిల్ లను నిస్సారమైన పిల్లలుగా చేస్తుంది. అందుకే www.ushasew.com లో చిన్న, సులభమైన ప్రాజక్ట్స్ రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్స్ మీరు నేర్చుకున్న అన్ని నైపుణ్యాలను ప్రయత్నించడానికి మీకు వీలుకల్పించి, ఫ్యాబ్రిక్స్ మరియు ఇతర వస్తువులతో కూడా ప్రయోగం చేయడానికి వీలుకల్పిస్తాయి.

మొదటి ప్రాజెక్ట్స్ లో ఒకటి ఏమిటంటే, బుక్ మార్క్స్ తయారు చేయడం.

ఇది ఎందుకు మొదటి ప్రాజెక్ట్స్ గా ఉందంటే, మీరు ఇప్పుడే మొదటి రెండు పాఠాలలో తెలుసుకున్నదానిని అది ఉపయోగిస్తుంది కాబట్టి. మీరు ముందుగా మీ ఉషా సూయింగ్ మిషిన్ ను ఎలా అమర్చాలో తెలుసుకోండి, తరువాత, కుట్టుపని సమయంలో మీ కుట్లను ఎలా నియంత్రించాలో, కాగితంపై తెలుసుకోండి మరియు చివరగా బట్టలపై కుట్టండి. ఇవన్నీ బుక్ మార్క్ ప్రాజెక్ట్ వినియోగించుకునే నైపుణ్యాలు. మీరు స్ట్రెయిట్ లైన్స్ లో మరియు మూలలలో కుట్టగలరు. అంతే. ఇది వినడానికి సరళం మరియు సులభం అనిపిస్తుంది మరియు అది సులభమే.

బుక్ మార్క్ ప్రాజెక్ట్, మీ స్వంత ఫాబ్రిక్స్ మరియు రంగులు ఎంచుకోవడానికి వీలుకల్పిస్తుంది. ఇది మీకు ఎంబెలిష్మెంట్స్ మరియు ఇతర అలంకరణ ఉపకరణాలు ఎలా జోడించాలి మరియు మీ బుక్ మార్క్ ను విశిష్టంగా ఎలా చేయాలని అని కూడా చూపుతుంది.

మీరు చేయవలసినదంతా, దశలవారీ సూచనలను అనుసరించడమే మరియు మీరు అక్కడికి చేరుకుంటారు. మీరు ప్రారంభించడానికి ముందు ఈ ప్రాజెక్ట్ వీడియోను కొన్నిసార్లు వీక్షించాలని మేము సూచిస్తున్నాము. మీరు వీడియోను మొదటి సారి చూసినప్పుదు, మీకు అవసరమైన వస్తువులన్నింటినీ సేకరించుకోండి. ఒక్కొక్క దశను కూడా ఈ వీడియోను ఆపుతూ తెలుసుకున్న తరువాత, చూపబడిన విధంగా వస్తువులను మడవడం లేదా వినియోగించడం చేయాలి. మీరు విశ్వాసంతో ఖచ్చితంగా సిద్ధమైన తరువాత మాత్రమే వాస్తవ కుట్టుపనిని ప్రారంభించాలి.

ఇప్పుడు నిజాయతీగా, ఇది నిజంగా సులభమైనది. ఇది కేవలం సరళరేఖలు మరియు నాలుగు మూలలు. అంతే. కానీ మీరు నూతనపరికల్పన చేయడానికి ఇందులో ఎంతో అవకాశం ఉంది. మీరు ఇక్కడ వాస్తవ ప్రయోగాలు చేయవచ్చు. అద్దాల ముక్కలు, పూసలు, మిక్స్ మరియు మ్యాచ్ ఫాబ్రిక్స్ ఉపయోగించి, మీ ఊహాశక్తిని బట్టి మీరు ఏమైనా చేయవచ్చు. ఈ రకంగా మీరు చేసే ప్రతి బుక్ మార్క్ కూడా దాని దంటూ ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

బుక్ మార్క్స్ అనేవి ఒక గొప్ప బహుమతి లాంటివి

అవును! ఇది మీ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసే ఒక బహుమతి. వారు మీరు చదువుతున్న పుస్తకాన్ని చూసిన ప్రతి సారీ కూడా వారి పేజిని గుర్తించడానికి బుక్ మార్క్ ను ఉపయోగిస్తారు, వారు మీకు మనసులోనే ధన్యవాదాలు చెబుతారు.

ఇంకా, మీరు పుస్తకాన్ని ఇవ్వాలనుకున్న వ్యక్తికి తగినట్లుగా బుక్ మార్క్ ను వ్యక్తిగతీకరించవచ్చు. వారికి ఫుట్ బాల్ ఇష్టమైతే, అప్పుడు నలుపు తెలుపులలో షడ్భుజులు, చిన్ని గంటలు చేసి, బెడ్ టైమ్ బుక్స్ ను మరింత ఆసక్తికరంగా దిద్దవచ్చు…మీ సృజనాత్మకతకు ఇక మేము అవరోధం కలిగించము.

మీరు కుట్టుపని ఎలా చేయాలనే దానిపై ఆసక్తిని కలిగి ఉంటే, దయచేసి, Ushasew.com కు లాగ్ ఆన్ కండి. ఇక్కడ మీకు కుట్టుపనిలో ఒక ఘనమైన పునాదిని అందించడానికి రూపొందించబడిన పాఠాలు మరియు ప్రాజెక్ట్స్ ఇవ్వబడ్డాయి. మీకు బోధించే పాఠాలు మరియ ప్రాజెక్ట్స్ ను గుర్తించి, మీ నైపుణ్యాలను ఎలా వినియోగించాలో చూపించండి. అన్నీ వివరమైన సమాచారంతో. మరియు 9 భారతీయ భాషలలో.

మీరు ప్రాజెక్ట్స్ చేయడం ప్రారంభించినప్పుడు, ఏవైనా సామాజిక నెట్స్ పై మా పేజీలలో మీ క్రియేషన్స్ పంచుకోండి. మీరు లింక్స్ ను క్రింద చూడవచ్చు.

The Incredible Usha Janome Memory Craft 15000

ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు యంత్రం ఉంది, అది ఇంజనీర్, శాస్త్రవేత్త మరియు...

Sewing is great for Boys & Girls

కుట్టు పని అనేది అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఒక మంచి అలవాటు. ఇందులో...

Leave your comment