Make Your Phone Happy With A Mobile Pouch

నేడు మన ఫోన్ మనం తీసుకువెళ్ళే అతి విలువైన వస్తువులలో ఒకటి. ఇందులో అన్నీ ఉన్నాయి, కాంటాక్ట్స్ నుండి ఇమెయిల్స్ వరకు, యాప్స్ నుండి ఫోటోల వరకు. ఈ ఎలెక్ట్రానిక్స్ వస్తువు మన జీవితంలో తిరుగులేని స్థానం కలిగి ఉంది కాబట్టి, మనం దీనిని సురక్షితంగా మరియు మన స్టైల్ ప్రతిబింబించేలా ఉంచడం ముఖ్యం. మనం దానిని దెబ్బలనుండి రోజంతా సంరక్షించాలి, ముఖ్యంగా, మనం దానిని మరొక చోట ఉంచకూడదు.

దీనిని చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి, ఈ పౌచ్ ను పొంది, అందులో మీ ఫోన్ ఉంచడమే. పౌచ్ తో గల ఏకైక సమస్య ఏమిటంటే అది మార్కెట్ నుండి కొన్నది, అది ఎప్పటికీ విశిష్టంగా ఉండదు.

మొబైల్ పౌచ్ ను పొందడం అనేది మీ వ్యక్తిత్వాన్ని మరియు స్టైల్ ను ప్రతిబింబిస్తుంది, దానిని మీరే స్వయంగా చేయాలి. అప్పుడెలా అని మీరు అనుకుంటూ ఉంటే, ఆందోళన చెందకండి, మీకు చూపుతాము.

మీకు కావలసినవన్నీ కలిసి కట్టుగా పొందడం ద్వారా ప్రారంభించండి.

మీరు ప్రారంభించడానికి ముందు, మీరు మొబైల్ ఫోన్ కవర్ చేయడానికి కావలసినవన్నీ సేకరించాలి. ఇది మా ప్రాజెక్ట్ “ఎ హ్యాండీ మొబైల్ పౌచ్” లో వివరంగా పట్టిక చేయబడింది, మేము ఒకదానిని చేయడంలో గల అన్ని అంశాలను పట్టిక చేసాము.

  • ఫ్యాబ్రిక్ ఒక ముక్క 9 అంగుళాలు బై 13 అంగుళాలుగా ఉండాలి
  • ఫ్యాబ్రిక్ యొక్క మూడు ముక్కలు, మీ సెల్ ఫోన్ కంటే కనీసం 3 అంగుళాల పెద్దవిగా ఉండాలి. వీటిలో ఒకటి రంగురంగులలో, ప్రింట్ చేయబడి లేదా టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ గా ఉండవచ్చు.
  • అలంకరణకు ఒక బటన్.
  • ఒక 1 అంగుళం వెల్క్రో ముక్క, బిగించడానికి.
  • మరియు స్లింగ్ కోసం ఒక పొడవాటి రిబ్బన్.

మీరు వీటన్నిటినీ పొందిన తరువాత, మీ ఫోన్ లేదా ల్యాప్ టాప్ తీసుకుని, మీ కుట్టుమిషిన్ టేబుల్ వద్ద సౌకర్యవంతంగా కూర్చుని చేయవచ్చు.

పాఠాన్ని చూసి, నేర్చుకోండి

www.ushasew.com ను సందర్శించండి మరియు ప్రాజెక్ట్ నం. పై క్లిక్ చేయండి. ఇక్కడే మేము మీకు మొబైల్ పౌచ్ ఎలా చేయాలో చూపిస్తాము. మనం ఇక్కడ ప్రారంభించి, మిమ్మల్ని ప్రతి దశలోనూ తీసుకువెళ్ళి, ఏమి చేయాలో మరియు ఎందుకు చేయాలో వివరిస్తాము

మీరు ప్రాజెక్ట్ వీడియో చూసినప్పుడు, మనం మొదటి దశ ప్రారంభించామని గమనిస్తారు అంటే మెటీరియల్ అన్నీ మరియు ఇతర మెటీరియల్ అన్నింటినీ లేఅవుట్ చేయబడింది తరువాత ఏమి చేయాలి ఎలా చేయాలనేది మేము వివరిస్తాము. ప్రతిఒక్కటీ వివరించబడింది, ఇందులో మీకు కావలసిన స్టిచ్ పొడవు, వెల్క్రో జోడించడం మరియు చివరగా మీ పౌచ్ అందంగా కనబడునట్లుగా చేయబడింది.

ఇప్పుడు మనకిష్టమైన రంగులను మరియు ఫ్యాబ్రిక్స్ ను ఉపయోగించాము. మీకు ఫ్యాన్సీగా తగినదేదైనా ఎంచుకోవడాన్ని స్వాగతిస్తున్నాము. ముందుకెళ్ళి, సాహసోపేతంగా చేయండి. మంచి రంగులు మరియు ఆకర్షణీయ రంగులను తీసుకుని, వాటితో ఆడుకోండి. ఇది మీ మొబైల్ పౌచ్, కాబట్టి ఇది మీ వ్యక్తిత్వాన్ని మరియు స్టైల్ ను ప్రతిబింబించాలి. కొలతలను సరిగా ఉంచుకోండి (ఒకటికి రెండుసార్లు కొలిచి, తరువాత ఒకసారి కత్తిరించండి). మీ వద్ద పెద్ద ఫోన్ ఉంటే, అప్పుడు వీడియోలో ఉపయోగించే కొలతలను పెంచుకోండి. మీరు అదనపు మెటీరియల్ ను తరువాత కత్తించడానికి వీలుగా ఓవర్ సైజ్ చేయడం మంచిది.

ఇది మీకు మొదటి ప్రాజెక్ట్ అయితే, నెమ్మదిగా చేయాలని సూచించడమైనది. మీరు సింగిల్ స్టిచ్ చేయడానికి ముందు వీడియోను మళ్ళీ చూడండి. మీరు చేస్తున్నదాని పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. ఇది స్పీడ్ కుట్టు పోటీ కాదు. తీసుకోబడే సమయం కంటే వాస్తవంగా ఫినిష్ చాలా ముఖ్యం. మీరు తప్పుచేస్తే ఆందోళన చెందకండి. మీ కత్తెరను తీసుకుని, ముక్కలను వేరు చేయడానికి కుట్లను కత్తిరించి, మళ్ళీ ప్రారంభించండి.

మీ మొబైల్ పౌచ్ ను చూడాలనుకుంటున్నాము.

మీరు మీ మొబైల్ పౌచ్ ను పూర్తి చేస్తే, దయచేసి ఆ పిక్చర్స్ ను మా సామాజిక నెట్వర్క్ పేజీలపై పంచుకోండి. వీలయిత, మీరు విభిన్నంగా చేసినవాటిని, మీరు ఎంచుకున్న వస్తువులు, రంగులు మొదలైన వాటిని వివరించండి.

ఈ ప్రాజెక్ట్ వినోదాత్మకంగా ఉంటే, మావద్ద ఇంకా ఆసక్తికరమైనవి మరికొన్ని ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ అన్నీ వారి స్వంత వ్యక్తిగత వీడియోలు, వాటిలో, ప్రతి ఒక్క దశను సరళమైన, సమాచారాత్మక పద్ధతిలో వివరించాము. మీరు ఏదైనా భాగాన్ని అర్థం చేసుకోలేకపతే, ప్రాజెక్ట్ వీడియోకు ముందున్న పాఠాలను చూడవచ్చు. ఈ పాఠం మీకు విడి దశలను తెలుపుతుంది – ఫాబ్రిక్ ను ఎలా కత్తిరించాలి, హెమ్మింగ్, జిప్పర్స్ కుట్టడం మొదలైనవి.

ఈ పాఠాలు మరియు ప్రాజెక్ట్స్ ఒక్కొక్కీ 9 విభిన్న భాషలలో లభిస్తుంది. కాబట్టి, మీకు అత్యంత సౌకర్యవంతమైనదానిని ఎంచుకోండి.మేము సైట్ లో ఇదివరకే ఉన్న పొడవాటి పట్టికకు క్రమవారీగా ప్రాజెక్ట్స్ మరియు వీడియోలను జోడిస్తూ ఉంటాము కాబట్టి అప్పుడప్పుడూ చూస్తూ ఉండండి. మీరు ఏదైనా ఉషా కుట్టు మిషిన్ గురించి సమాచారం కోరుకుంటే అక్కడ మొత్తం శ్రేణి ప్రదర్శించబడింది. మా కస్టమర్ కేర్ నంబర్ ను సైట్ పైభాగాన కుడివైపున ఇవ్వబడింది, మీకు డెమో కావాలంటే లేదా ఏదైనా ఇతర సమాచారం కావాలంటే కాల్ చేయండి.

The Incredible Usha Janome Memory Craft 15000

ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు యంత్రం ఉంది, అది ఇంజనీర్, శాస్త్రవేత్త మరియు...

Sewing is great for Boys & Girls

కుట్టు పని అనేది అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఒక మంచి అలవాటు. ఇందులో...

Leave your comment